logo

బీసీ బాలుర వసతి గృహంలో ఎలుకలు

తొమ్మిది మంది విద్యార్థులను ఎలుకలు గాయపరచిన ఘటన రంగారెడ్డిజిల్లా షాద్‌నగర్‌ పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ బాలుర వసతిగృహంలో చోటుచేసుకుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలిపిన వివరాల

Published : 07 Dec 2021 02:38 IST

కొరకడంతో 9మంది విద్యార్థులకు గాయాలు

చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన విద్యార్థులు

షాద్‌నగర్‌ న్యూటౌన్‌, న్యూస్‌టుడే: తొమ్మిది మంది విద్యార్థులను ఎలుకలు గాయపరచిన ఘటన రంగారెడ్డిజిల్లా షాద్‌నగర్‌ పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ బాలుర వసతిగృహంలో చోటుచేసుకుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలిపిన వివరాల మేరకు.. కేశంపేట, దౌల్తాబాద్‌ మండలాలకు మంజూరైన జ్యోతిబాపూలే బీసీ బాలుర వసతిగృహాలు షాద్‌నగర్‌ పురపాలికలోని చటాన్‌పల్లిలోని వివేకానంద ఇంజినీరింగ్‌ కళాశాల భవనంలో మూడేళ్లుగా కొనసాగుతోంది. ఇక్కడ 850మంది విద్యార్థులు ఉన్నారు. ఆదివారం విద్యార్థులను చూడటానికి వచ్చిన తల్లిదండ్రులు తమ పిల్లలకు తినుబండారాలను ఇవ్వడంతో వాటిని చిన్నారులు మూడో అంతస్తులోని పడకగదిలో ఉన్న బ్యాగుల్లో భద్రపరిచారు. విద్యార్థులు నిద్రించగా తినుబండారాల కోసం వచ్చిన ఎలుకలు విద్యార్థులను కొరకడం, రక్కడంతో వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 9వ తరగతి చదువుతున్న 9మంది గాయపడ్డారు. సోమవారం ఉదయం ఉపాధ్యాయులకు చెప్పడంతో అక్కడే ఉన్న ఆరోగ్య సిబ్బంది విద్యార్థులకు ప్రథమచికిత్స చేశారు. అనంతరం షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి టీటీ ఇంజక్షన్‌ వేయించారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని ప్రిన్సిపల్‌ సుభాన్‌, ఆరోగ్య సిబ్బంది తెలిపారు.  

ఎలుక కొరకడంతో ఏర్పడిన గాయాన్ని చూపిస్తున్న విద్యార్థి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని