logo

మామిడిపల్లి ఉన్నత పాఠశాలలో నలుగురికి కరోనా

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గం నందిగామ మండలంలోని మామిడిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో నలుగురు విద్యార్థులకు కరోనా నిర్ధారణ కావడంతో కలకలం చెలరేగింది. హెచ్‌ఎం శ్రీనివాసులు తెలిపిన

Published : 07 Dec 2021 02:38 IST

షాద్‌నగర్‌ న్యూటౌన్‌, నందిగామ, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గం నందిగామ మండలంలోని మామిడిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో నలుగురు విద్యార్థులకు కరోనా నిర్ధారణ కావడంతో కలకలం చెలరేగింది. హెచ్‌ఎం శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం..‘‘పాఠశాలలో 128మంది విద్యార్థులున్నారు. వీరిలో 28మందికి జ్వరం, దగ్గు, జలుబు ఉండటంతో వైద్యాధికారులకు సమాచారం అందించాం. వైద్యసిబ్బంది పాఠశాలకు వచ్చి పరీక్షలు చేయగా నలుగురికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. విద్యార్థులు మండల పరిధిలోని మొదళ్లగూడ, వీర్లపల్లి, మోత్కులగూడ, మామిడిపల్లి గ్రామాలకు చెందిన వారు’’ అని తెలిపారు.

అప్రమత్తం చేస్తున్నాం:  డిప్యూటీ డీఎంహెచ్‌ఓ దామోదర్‌
వ్యాధి బారిన పడిన విద్యార్థులకు కిట్లను అందించి ఐసోలేషన్‌లో ఉండాలని సూచించాం. మంగళవారం పాఠశాల విద్యార్థులతోపాటు విద్యార్థుల ఇంటి పరిసరాల్లోని వారికీ పరీక్షలు చేస్తాం. వైద్య సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని