logo

తప్పుడు ధ్రువపత్రాలు పొందితే చర్యలు

విభిన్న ప్రతిభావంతుల పేరిట తప్పుడు ధ్రువపత్రాలు పొందిన వారిపై కఠినచర్యలు తప్పవని ఏపీ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంస్థ ఛైర్‌పర్సన్‌ ముంతాజ్‌పఠాన్‌ హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ జిల్లా కార్యాలయాన్ని

Published : 19 Jan 2022 02:05 IST

కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న సంస్థ ఛైర్‌పర్సన్‌ ముంతాజ్‌ పఠాన్‌

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: విభిన్న ప్రతిభావంతుల పేరిట తప్పుడు ధ్రువపత్రాలు పొందిన వారిపై కఠినచర్యలు తప్పవని ఏపీ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంస్థ ఛైర్‌పర్సన్‌ ముంతాజ్‌పఠాన్‌ హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ జిల్లా కార్యాలయాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు, ఇతర లబ్ధిపొందుతున్న వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈ విషయమై ఫిర్యాదులు వచ్చాయని, కొన్ని ధ్రువపత్రాలు తనవద్దకు వచ్చాయని పేర్కొన్నారు.

దీనిలో భాగంగానే వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. అనంతపురం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఈ సమస్య ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. కృష్ణా జిల్లాలోనూ ఇలాంటి సమస్య ఉన్నట్లు చెబుతున్నా ఆధారాలు చూపించలేక పోతున్నారన్నారు. దివ్యాంగులకు సంబంధించి బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగ హక్కుల జాతీయవేదిక ప్రతినిధులు ఆమెను కలిసి వివిధ సమస్యలను వివరించారు. నియోజకవర్గాల వారీగా దివ్యాంగులకు వసతి కల్పించాలని, ఆర్టీసీ బస్‌పాస్‌ల జారీలో నిబంధనలు మార్చాలని, అందరికీ గుర్తింపుకార్డులు తదితర డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఎన్‌.సత్యనారాయణ, శంకర్‌, నాగబాబు, తదితరులు వినతిపత్రం అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని