అదుపుతప్పి కారు బోల్తా.. ఇద్దరికి గాయాలు
అదుపుతప్పి కారు బోల్తాపడటంతో ప్రయాణికుల్లో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని మాధవరం శివారులో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం
నగదు అందజేసి నిజాయతీ చాటుకున్న 108 సిబ్బంది
సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బాధితులకు నగదును అందజేస్తున్న 108 సిబ్బంది
మునగాల గ్రామీణం, న్యూస్టుడే: అదుపుతప్పి కారు బోల్తాపడటంతో ప్రయాణికుల్లో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని మాధవరం శివారులో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన నాగేశ్వరరావు, నాగరాజు, వెంకటేశ్వర్లు వారం కిందట సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని స్వగ్రామానికి వెళ్లారు. పని ముగిసిన తర్వాత ముగ్గురు కలిసి మంగళవారం కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మాధవరం సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పింది. కాల్వలో దూసుకెళ్లింది. ప్రమాదంలో నాగేశ్వరరావు, నాగరాజు గాయపడ్డారు. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స నిర్వహించి సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మూడో వ్యక్తి సైతం వీరితో వైద్యశాలకు వచ్చారు. అయితే కారు లో బాధితులు మర్చిపోయిన రూ.3.50 లక్షల నగదు, 6 బంగాలు ఉంగరాలు, బ్రాస్లెట్లను గుర్తించి భద్రపరిచారు. ఇవి వారివే నని ధ్రువీకరించుకు ని ఆస్పత్రిలో 108 ఈఎంటీ ముత్తయ్య, ఫైలట్ కన్నయ్య అందజేశారు. బాధితులు వీరికి అభినందనలు తెలిపారు. ఈ విషయమై ఎస్సై ఎన్ బాలునాయక్ను మాట్లాడుతూ తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!