logo

వీధుల్లో ఎలుగుబంటి హల్‌చల్‌

మెట్టూరులో సోమవారం రాత్రి ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. వీధుల్లో పరుగులు పెడుతూ గ్రామస్థులను భయాందోళనకు గురిచేసింది. అమ్మవారి ఆలయం వద్ద కొంత సమయం సంచరించింది. ఆలయం వరండాలో

Published : 19 Jan 2022 05:16 IST


మెట్టూరు ఆలయం వద్ద ప్రసాదం తింటున్న ఎలుగుబంటి

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: మెట్టూరులో సోమవారం రాత్రి ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. వీధుల్లో పరుగులు పెడుతూ గ్రామస్థులను భయాందోళనకు గురిచేసింది. అమ్మవారి ఆలయం వద్ద కొంత సమయం సంచరించింది. ఆలయం వరండాలో ఉన్న ప్రసాదం తిని, వీధుల గుండా గ్రామ పరిసర తోటల్లోకి వెళ్లిపోయింది. కొద్దిరోజులుగా ఎలుగులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. జీడి పంట సీజన్‌ కావడంతో తోట పనులకు వెళ్లలేకపోతున్నామని గ్రామాల ప్రజలు వాపోతున్నారు. సంబంధితాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని