logo

Crime News: న్యాయానికి వస్తే వశం చేసుకున్నాడు

పెళ్లయిన రెండేళ్లకే భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు ఇప్పించాలని కోరుతూ వచ్చిన తనకు ఓ న్యాయవాది అన్యాయం చేశాడంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మల్కాజిగిరి సీఐ జగదీశ్వరరావు కథనం ప్రకారం..

Published : 22 Jan 2022 08:14 IST

మల్కాజిగిరి, న్యూస్‌టుడే: పెళ్లయిన రెండేళ్లకే భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు ఇప్పించాలని కోరుతూ వచ్చిన తనకు ఓ న్యాయవాది అన్యాయం చేశాడంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మల్కాజిగిరి సీఐ జగదీశ్వరరావు కథనం ప్రకారం.. ఓ ప్రైవేటు ఉద్యోగిని (25) భర్తతో గొడవలయ్యాయి. విడాకులు తీసుకునేందుకు గత ఏడాది జూన్‌లో ఓ న్యాయవాదిని సంప్రదించింది. ఆమెను పలుమార్లు తన కార్యాలయానికి రప్పించుకున్న న్యాయవాది ఆమెతో చనువు పెంచుకున్నాడు. బాధితురాలు అద్దెకు ఇల్లు వెతుకుతోందని తెలుసుకున్న న్యాయవాది తాను నివసించే ప్రాంతంలోనే ఒక ఫ్లాట్‌  చూపించాడు. అందులో ఆమెకు తెలియకుండా  సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. బాధితురాలు దుస్తులు మార్చుకునే సమయంలో చిత్రీకరించి వాటిని చూపించి బాధితురాలిని వశం చేసుకున్నాడు. వేధింపులు ఎక్కువ చేయడంతో భరించలేక ఆమె మల్కాజిగిరి పోలీసులకు ఈనెల 13న ఫిర్యాదు చేసింది. ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు