logo

పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల శివారులోని పెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలో ఆదివారం సాయంత్రం 6 ఎమ్‌.వి.ఎ సామర్థ్యం....

Published : 06 Dec 2021 04:29 IST


పరిశ్రమ నుంచి వెలువడుతున్న పొగ

కట్టంగూరు, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల శివారులోని పెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలో ఆదివారం సాయంత్రం 6 ఎమ్‌.వి.ఎ సామర్థ్యం గల నియంత్రికలో ఆయిల్‌ లీకై మంటలు లేచాయి. మంటలు వ్యాపించి పక్కనున్న ఫ్లాంటుకు అంటుకున్నాయి. దీంతో బ్లోయర్లు, పైపులు, విద్యుత్తు తీగలు, బెల్టులు తగలబడి, భారీగా మంటలు లేచినట్లు తెలిసింది. దట్టమైన పొగలు అలుముకున్నాయి. నకిరేకల్‌, నల్గొండ నుంచి అగ్ని మాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని గంట పాటు శ్రమించి మంటలను చల్లార్చాయి. రూ.60 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు, ప్రాణనష్టం జరగలేదని యాజమాన్యం వెల్లడించింది. ఘటన స్థలాన్ని ఎస్సై శివప్రసాద్‌ పరిశీలించారు. ఘటనపై తమకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని