logo

బారులు తీరి.. శ్రీస్వామిని దర్శించి

యాదాద్రి పుణ్యక్షేత్రంలో వారాంతపు రోజైన ఆదివారం వివిధ ప్రాంతాలకు చెందిన భక్తజనులతో సందడి నెలకొంది. మండపాలలో ఆర్జిత ఆరాధనలు, ఆలయంలో దైవ దర్శనాలు..

Published : 06 Dec 2021 04:29 IST

కొండపైన బాలాలయం పరిసరాల్లో భక్తుల సందడి

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రంలో వారాంతపు రోజైన ఆదివారం వివిధ ప్రాంతాలకు చెందిన భక్తజనులతో సందడి నెలకొంది. మండపాలలో ఆర్జిత ఆరాధనలు, ఆలయంలో దైవ దర్శనాలు.. కొండ కింద వ్రతాల పర్వాలతో ఆధ్యాత్మికతను సంతరించుకుంది. వేకువజామున బాలాలయంలో సుప్రభాతం చేపట్టిన పూజారులు పంచనారసింహులను మేల్కొలిపి ప్రతిష్ఠామూర్తులకు హారతి నివేదన జరిపారు. నిత్య కైంకర్యాలను ఆలయ ఆచారంగా చేపట్టి భక్తులకు శ్రీస్వామి అమ్మవారల ఆశీస్సులు అందజేశారు. నిత్యకల్యాణం, నిజాభిషేకం, శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు అష్టోత్తరంలో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దైవదర్శనం కోసం భక్తులు గంటలకొద్దీ బారులు తీరారు. ప్రసాదాల కొనుగోళ్లకు భక్తులు పోటీపడ్డారు. క్షేత్రాభివృద్ధి పనులు కొనసాగుతున్న దృష్ట్యా కొండపై ఆలయ పరిసరాలలో గజిబిజి వాతావరణం కనిపించింది. వివిధ విభాగాల ద్వారా నిత్యాదాయం రూ.22,69,332 జమైనట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. బాలాలయంలో సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పర్వాలతో పాటు వేదాశీర్వచనం కొనసాగింది. పాతగుట్ట ఆలయంలోనూ భక్తజనులు మొక్కు పూజలు చేపట్టారు. నిత్యకల్యాణంలో దంపతులు పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట: యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర అటవీశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శాంతకుమారి ఆదివారం సందర్శించారు. బాలాలయంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని పూజలు చేపట్టారు. స్వామి అమ్మవార్ల నిత్యకల్యాణోత్సవం తిలకించారు. అష్టోత్తరంలో పాల్గొని ఆశీస్సులు పొందారు. ఆమెకు ఆలయ ఈవో గీత స్వాగతం పలికారు.

బాలాలయంలో శ్రీస్వామి, అమ్మవార్లకు మొక్కుతున్న అటవీశాఖ అధికారి శాంతకుమారి, తదితరులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని