logo

రైతుల పోరాట స్ఫూర్తితో ఉద్యమిద్దాం

వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ దిల్లీలో రైతులు ఏడాది పాటు చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని పాలకుల విధానాలపై ఉద్యమించడానికి సిద్ధం కావాలని అఖిల....

Published : 06 Dec 2021 04:29 IST

అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌


సమావేశంలో మాట్లాడుతున్న బి.వెంకట్‌

భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌టుడే: వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ దిల్లీలో రైతులు ఏడాది పాటు చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని పాలకుల విధానాలపై ఉద్యమించడానికి సిద్ధం కావాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ అన్నారు. పురపాలిక కేంద్రంలో ఆదివారం జరిగిన యాదాద్రి భువనగిరి జిల్లా ద్వితీయ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కిసాన్‌ ఉద్యమంలో ఎర్రజెండా అత్యంత కీలకపాత్ర పోషించిందని గుర్తుచేశారు. రైతులను భూమి నుంచి దూరం చేసేందుకు కేంద్రం అనేక ఎత్తుగడలు వేస్తోందని విమర్శించారు. ప్రస్తుత మార్కెట్‌ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు చేతుల్లో పెడుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జహంగీర్‌, చెరుపల్లి సీతారాములు, పగిళ్ల లింగారెడ్డి, కొండమడుగు నర్సింహ, ఆగయ్య, బుచ్చిరెడ్డి, బాలరాజు, మల్లేశం, అంజిరెడ్డి, ఆనంద్‌, పాండు, చంద్రారెడ్డి, కృష్ణారెడ్డి, అంజయ్య పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని