logo

గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభకు కొదవలేదు: పుల్లెల గోపీచంద్‌

దేశం, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత క్రీడాకారులలో ప్రతిభకు కొదవలేదని.. వారిని సరైన విధంగా ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌....

Published : 06 Dec 2021 04:39 IST


కోదాడలో మాట్లాడుతున్న గోపీచంద్‌

కోదాడ పట్టణం, న్యూస్‌టుడే: దేశం, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత క్రీడాకారులలో ప్రతిభకు కొదవలేదని.. వారిని సరైన విధంగా ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బ్యాడ్మింటన్‌ జిల్లా క్రీడాకారుడు తోట రంగారావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివారం మాట్లాడారు. గత మూడు ఒలంపిక్స్‌ పోటీల్లో భారతదేశానికి పతకాలు రావడం శుభపరిణామంగా అభిప్రాయపడ్డారు. రాబోయే రెండు నెలల్లో రాష్ట్రంలో పలు టోర్నమెంట్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా రాష్ట్రస్థాయి క్రీడాకారుల ర్యాంకింగ్‌ మెరుగుపడతాయని వివరించారు. కేంద్రం ఖేలో ఇండియా, ఫిట్‌ ఇండియా పథకాల ద్వారా క్రీడారంగాన్ని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటుకు ప్రోత్సాహం అందించిందన్నారు. కోదాడలోని బ్యాడ్మింటన్‌ ఇండోర్‌ స్టేడియం ఉన్నత ప్రమాణాలతో ఉందని చెప్పారు. ఒలంపిక్స్‌ విజేత పీవీ సింధుకు ఉజ్వల భవిష్యత్తు ఉందని.. తర్వాతి ఒలంపిక్స్‌లోనూ పతకం సాధించి దేశానికి వన్నె తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో జిల్లాల్లో బ్యాడ్మింటన్‌ శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని