logo

మైనార్టీ ఉద్యోగుల సమస్యలపై పోరాటం

మైనార్టీ ఉద్యోగుల సమస్యలపై ఐక్యంగా పోరాడాలని తెలంగాణ మైనార్టీ ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నేషనల్‌ కోఆర్డినేటర్‌ సయ్యద్‌ షౌకత్‌ అలీ అన్నారు.

Published : 06 Dec 2021 04:39 IST


సమావేశంలో మాట్లాడుతున్న సయ్యద్‌ షౌకత్‌ అలీ

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: మైనార్టీ ఉద్యోగుల సమస్యలపై ఐక్యంగా పోరాడాలని తెలంగాణ మైనార్టీ ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నేషనల్‌ కోఆర్డినేటర్‌ సయ్యద్‌ షౌకత్‌ అలీ అన్నారు. ఆదివారం స్థానిక రెవెన్యూ అతిథిగృహంలో జరిగిన అసోసియేషన్‌ జిల్లా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వ నియంతృత్వ విధానాల వల్ల ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. ముఖ్యమంత్రి ఉద్యోగుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే ప్రకటించాలన్నారు. పీఆర్‌సీ వల్ల ఉద్యోగులకు లాభం కంటే నష్టమే అధికంగా జరిగిందని తెలిపారు. సమావేశం అనంతరం అసోసియేషన్‌ జిల్లా నూతన అధ్యక్షుడుగా ఎండి.గులాం రబ్బానీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో ఎంఐఎం మాజీ జిల్లా అధ్యక్షుడు అహ్మద్‌ కలీం, చాంద్‌పాషా, ముబీన్‌, షకీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని