logo

కాలుష్యం నుంచి నేలతల్లిని బతికించుకుందాం: డీఏవో

కాలుష్యం నుంచి నేలతల్లిని బతికించుకుందామని జిల్లా వ్యవసాయాధికారి రామారావునాయక్‌ అన్నారు. ఆదివారం గడ్డిపల్లి కేవీకేలో జరిగిన ప్రపంచ మృత్తికా.....

Published : 06 Dec 2021 04:54 IST

గరిడేపల్లి, న్యూస్‌టుడే: కాలుష్యం నుంచి నేలతల్లిని బతికించుకుందామని జిల్లా వ్యవసాయాధికారి రామారావునాయక్‌ అన్నారు. ఆదివారం గడ్డిపల్లి కేవీకేలో జరిగిన ప్రపంచ మృత్తికా దినోత్సవ వేడుకలలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల రసాయన ఎరువుల, పురుగుమందుల వాడకం వల్ల కాలుష్యం పెరిగిపోయిందని తద్వారా నేల పూర్తిగా కలుషితమైయిందన్నారు. రానున్న రోజుల్లో సేంద్రియం పెంచకపోతే ధరణిలోని అన్ని ప్రాణులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. రైతులు నేల సారాన్ని పెంచడానికి విచ్చలవిడిగా మందులు వాడుతున్నారని దాన్ని క్రమంగా తగ్గించాలని సూచించారు. ఇకనైనా మేల్కొని భావితరాలకు సారవంతమైన, కలుషిత రహిత నేలను అప్పగించాలని కోరారు. భూమిలో పోషకాలు, నేల సారం, మృత్తికా దినోత్సవ ప్రాధాన్యత అంశాలను శాస్త్రవేత్త ఎ.కిరణ్‌ వివరించారు. అనంతరం దేశీ ఇన్‌ఫుట్‌ డీలర్ల శిక్షణ ముగింపు సమావేశంలో పాల్గొని డీలర్లకు ధ్రువీకరణ పత్రాలు అందించారు. ప్రోగ్రాం ఇన్‌ఛార్జి బి.లవకుమార్‌, శాస్త్రవేత్తలు నరేశ్‌, సిహెచ్‌.నరేశ్‌, డి.ఆదర్ష్‌, సుగంధి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని