logo

రైతులు ఆరుతడి పంటలపై దృష్టిసారించండి: కలెక్టర్‌

ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టిసారించాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. సింగారెడ్డిపాలెంలో ఆదివారం నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో మాట్లాడారు.

Published : 06 Dec 2021 04:54 IST


సింగారెడ్డిపాలెంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

పెన్‌పహాడ్‌: ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టిసారించాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. సింగారెడ్డిపాలెంలో ఆదివారం నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో మాట్లాడారు. యాసంగి సీజన్‌ నుంచి వరి వేయకుండా వేరుశనగ, పెసర, కందులు, మినుములు, పొద్దుతిరుగుడు, ఆయిల్‌ఫాం తోటలు, వివిధ రకాల కూరగాయల పంటలు సాగు చేయాలని సూచించారు. ఎఫ్‌సీఐ యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని, ఈ కారణంగా కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేసిందన్నారు. కొవిడ్‌ను అరికట్టేందుకు అందరూ రెండో డోసు టీకా వేసుకోవాలన్నారు. డీఏవో రామారావు నాయక్‌, సర్పంచి షరీపుద్దిన్‌, ఏవో కృష్ణసందీప్‌, ఉప సర్పంచి పేర్ల లింగయ్య, ఏఈవో గోపి, రైబస గ్రామ సమన్వయకర్త మున్న వెంకన్న, వీబీకే పేర్ల గణేశ్‌, వెంకులు, దినేష్‌ పాల్గొన్నారు.

చివ్వెంల: ధాన్యం కొనుగోళ్ల వేగం పెంచాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు.దురాజ్‌పల్లిలోని ఐకేపీీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 293 కొనుగోలు కేంద్రాల ద్వారా లక్షా పది వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని