logo
Published : 06/12/2021 04:54 IST

పోలీసుల కీర్తిప్రతిష్ఠలు పెంపొందించాలి: ఎస్పీ


మట్టపల్లి ఆలయంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్‌కు శ్రీస్వామి చిత్రపటాన్ని అందజేస్తున్న ఈవో నవీన్‌

సూర్యాపేట నేరవిభాగం: జిల్లాలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులపై ఉందని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో స్పెషల్‌ బ్రాంచ్‌ సిబ్బందితో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పోలీసుల కీర్తిప్రతిష్ఠలను పెంపొందించేలా పనిచేయాలని కోరారు. పౌరులకు సేవలు అందించే విషయంలోనూ పోలీసులను అప్రమత్తం చేయాలన్నారు. స్పెషల్‌ బ్రాంచి ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ఎస్సై నవీన్‌, క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నారు.

మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనృసింహుని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి సిరికొండ నవీన్‌, అర్చకులు, వేద పండితులు పద్మనాభాచార్యులు, బదరీనారాయణాచార్యులు, నరసింహమూర్తి ఎస్పీకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈవో స్వయంభువుని చిత్రపటంతో పాటు స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని