logo

ఎమ్మెల్యే చెప్పినా.. స్పందించరేం!

కలెక్టరేట్‌లో ఈ నెల 13న ఎమ్మెల్యే జోగు రామన్న అధ్యక్షతన కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలపై అధికారులతో సమీక్షించారు. పాలనాధికారి సిక్తా పట్నాయక్‌, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ నరేందర్‌ ఇతర అధికారులకు పలు సూచనలు చేశారు.

Published : 19 Jan 2022 02:18 IST

రైల్వేస్టేషన్‌ నుంచి మాస్కులు లేకుండా బయటకు వస్తున్న ప్రయాణికులు


పంజాబ్‌చౌరస్తాలో పోలీసుల తనిఖీలు

కలెక్టరేట్‌లో ఈ నెల 13న ఎమ్మెల్యే జోగు రామన్న అధ్యక్షతన కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలపై అధికారులతో సమీక్షించారు. పాలనాధికారి సిక్తా పట్నాయక్‌, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ నరేందర్‌ ఇతర అధికారులకు పలు సూచనలు చేశారు. అందులో ప్రథమంగా మహారాష్ట్ర నుంచి నిత్యం రైలులో వస్తున్న వారు మాస్కులు ధరించడం లేదని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నేతాజీ కూడలిలో అడ్డా కూలీలు, మున్సిపాల్టీ పరిధిలో రైతు బజార్‌లోని దుకాణాలలో అంతా మాస్కులు ధరించేలా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సూచించారు. అవన్నీ మాటలకే పరిమితమయ్యాయి. అధికారులు వాటిని పట్టించుకోవడమే మానేశారు. పోలీసులు నేతాజీచౌక్‌లో రహదారులపై వెళ్లే వారిపై మాత్రమే దృష్టి సారిస్తున్నారు. మంగళవారం ఎమ్మెల్యే చెప్పిన ప్రాంతాలు ‘ఈనాడు’ పరిశీలించగా.. ఇలా కనిపించారు.

- ఈనాడు, ఆదిలాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని