logo

Crime News:వాగ్వాదం కారణంగానే తల నరికేశాడు

సంక్రాంతి పండుగరోజు జరిగిన గొడవలో హత్య చేసిన నిందితుడ్ని మంగళవారం అరెస్టు చేసినట్లు మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు. మంగళవారం స్థానిక రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆయన నిందితుడిని అరెస్టు చూపి వివరాలు వెల్లడించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వలసపల్లె గ్రామస్థులు

Updated : 19 Jan 2022 07:43 IST

తలారి సురేష్‌ హత్యకేసులో నిందితుడి అరెస్టు


నిందితుడ్ని అరెస్టు చూపుతున్న డీఎస్పీ రవిమనోహరాచారి

మదనపల్లె(నేరవార్తలు): సంక్రాంతి పండుగరోజు జరిగిన గొడవలో హత్య చేసిన నిందితుడ్ని మంగళవారం అరెస్టు చేసినట్లు మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు. మంగళవారం స్థానిక రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆయన నిందితుడిని అరెస్టు చూపి వివరాలు వెల్లడించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వలసపల్లె గ్రామస్థులు చందాలు వేసుకుని నడివీధి గంగమ్మకు పొట్టేలు బలి ఇచ్చే కార్యక్రమం ఏటా జరుపుకొంటున్నారు. ఇందులో భాగంగానే ఈనెల 16వ తేదీ రాత్రి నడివీధి గంగమ్మ వద్ద పూజ నిర్వహిస్తుండగా గ్రామానికి చెందిన తలారి సురేష్‌(29) తాను పొట్టేలును బలి ఇస్తానని ముందుకు వచ్చాడు. చందా డబ్బు ఇవ్వకపోగా పూజా కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నావని అక్కడే ఉన్న పెద్దనాన్న కుమారుడు తలారి చలపతి మందలించాడు. సురేష్‌ అక్కడి నుంచి వెళ్లకుండా డ్రమ్స్‌ వాయిద్యాల వద్ద డ్యాన్స్‌ చేయడంతో ఆగ్రహించిన చలపతి కొడవలితో సురేష్‌ తలపై నరికి పరారయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో చలపతి హంద్రీనీవా కాలువ వద్ద ఉండగా అరెస్టు చేసి అతని నుంచి వేట కొడవలిని స్వాధీనం చేసుకున్నామని డీఎస్సీ వివరించారు. హత్య జరిగిన రెండు రోజుల్లోనే నిందితుడ్ని పట్టుకున్న రూరల్‌ సీఐ శ్రీనివాసులు, ఎస్సై చంద్రశేఖర్‌ను డీఎస్పీ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని