logo

ఇదేం పనిమాస్టారూ!

తమ పిల్లల పట్ల ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ కలగర గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాల వద్ద మంగళవారం ప్రజలు ఆందోళన చేపట్టారు. కొంతకాలంగా ధరావత్తు బాలు అనే ఉపాధ్యాయుడు తమ పిల్లలను

Published : 19 Jan 2022 03:31 IST

అనుచిత ప్రవర్తనపై కలగరవాసుల కలవరం

విస్సన్నపేట, న్యూస్‌టుడే: తమ పిల్లల పట్ల ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ కలగర గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాల వద్ద మంగళవారం ప్రజలు ఆందోళన చేపట్టారు. కొంతకాలంగా ధరావత్తు బాలు అనే ఉపాధ్యాయుడు తమ పిల్లలను తాకుతూ, అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న ఎంఈవో సీహెచ్‌.రామకృష్ణ అక్కడికి చేరుకుని, గ్రామస్థులకు నచ్చచెప్పారు. విచారణ చేపట్టగా, కోపం చల్లారని ప్రజలు వారిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. ఎంఈవోతో పాటు ఉపాధ్యాయుడు కలిసి తరగతి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకోవలసి వచ్చింది. ఎమ్పీడీవో వచ్చి చర్యలకు  హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం ఎంఈవో రామకృష్ణ మాట్లాడుతూ జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని