logo

గుండెపోటుతో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మృతి

తెవివి దక్షిణ ప్రాంగణం సోషల్‌ వర్క్‌ విభాగంలో అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌(కాంట్రాక్ట్‌)గా విధులు నిర్వహిస్తున్న వీరబత్తిని లక్ష్మణ్‌(59) గుండెపోటుతో మృతిచెందారు.

Updated : 19 Jan 2022 03:14 IST

లక్ష్మణ్‌

భిక్కనూరు(కామారెడ్డి కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: తెవివి దక్షిణ ప్రాంగణం సోషల్‌ వర్క్‌ విభాగంలో అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌(కాంట్రాక్ట్‌)గా విధులు నిర్వహిస్తున్న వీరబత్తిని లక్ష్మణ్‌(59) గుండెపోటుతో మృతిచెందారు. ఆయన పెద్దనాన్న కుమారుడు అయిదు రోజుల క్రితం మృతిచెందగా అంత్యక్రియల్లో పాల్గొనడానికి సోమవారం కామారెడ్డి నుంచి చేర్యాలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో జనగామ బస్సెక్కి సిద్దిపేటకు బయలుదేరారు. సీట్లో కూర్చున్న కాసేపటికి నిద్రపోయారు. బస్సు సిద్దిపేటకు చేరుకుని తిరిగి చేర్యాలకు బయలుదేరినా లేవలేదు. సిద్దిపేట కలెక్టరేట్‌ వద్ద కండక్టర్‌ టికెట్‌ అడిగేందుకు తట్టిచూడగా కింద పడిపోయారు. నిద్రలోనే గుండెపోటుతో చనిపోయారు. మంగళవారం ఆయన స్వగ్రామం చేర్యాలలో అంత్యక్రియలు నిర్వహించారు. లక్ష్మణ్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. దక్షిణ ప్రాంగణంలో పదేళ్లపాటు పని చేసిన ఆయన తన 55వ ఏట పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. లక్ష్మణ్‌ మృతిపట్ల వీసీ రవీందర్‌గుప్తా సంతాపం వ్యక్తం చేశారు.


బాలుడిపై లైంగిక దాడి, హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు

నిజామాబాద్‌ న్యాయవిభాగం, బీబీపేట, న్యూస్‌టుడే: బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన కేసులో కామారెడ్డి జిల్లా బీబీపేటకు చెందిన విభూతి సాయిలు(22)కు జీవిత ఖైదు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ రెండో అదనపు కోర్టు జిల్లా జడ్జి పంచాక్షరి మంగళవారం తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. 2020 ఆగస్టు 7న సాయిలు మండల కేంద్రానికి చెందిన ఓ బాలుడికి(10) డబ్బులు ఇస్తానని మాయమాటలు చెప్పి ఊరి శివారులోని బల్లనికుంటకు తీసుకెళ్లాడు. అక్కడ లైంగికదాడికి పాల్పడిన తర్వాత హత్య చేసి కుంటలో పడేశాడు. బాలుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా నిందితుడు నేరం ఒప్పుకొన్నాడు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి ఈ మేరకు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. పోలీసుల తరఫున రెండో అదనపు కోర్టు ఇన్‌ఛార్జి పిపి రవిరాజ్‌ వాదించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని