logo

పక్షుల పలకరింపు... ప్రకృతి పులకరింపు

పశ్చిమ కృష్ణాలో వేసవికి ముందు కనిపించే విదేశీ పక్షుల పలకరింపు ప్రకృతి ప్రేమికులను పులకరింపజేస్తుంది. శీతాకాలంలో ప్రారంభమయ్యే విదేశీ విహంగాల రాక జనవరి చివరి వరకు కొనసాగుతుంది. ఇక్కడ గుడ్లు పెట్టి, పొదిగి పిల్లలు పెరిగే వరకూ

Published : 19 Jan 2022 03:31 IST

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే

శ్చిమ కృష్ణాలో వేసవికి ముందు కనిపించే విదేశీ పక్షుల పలకరింపు ప్రకృతి ప్రేమికులను పులకరింపజేస్తుంది. శీతాకాలంలో ప్రారంభమయ్యే విదేశీ విహంగాల రాక జనవరి చివరి వరకు కొనసాగుతుంది. ఇక్కడ గుడ్లు పెట్టి, పొదిగి పిల్లలు పెరిగే వరకూ అతిథులుగా ఉండి వేసవి తరువాత వెళ్లిపోతాయి. కాలుష్యం పెరుగుతున్నందున పక్షుల సంఖ్య తగ్గినప్పటికీ ఈ ప్రాంత నైసర్గిక స్వరూపం విహంగాలను ఆహ్వానిస్తూనే ఉంది. కృష్ణా నది తీర ప్రాంతం, మునేరు, పాలేరు, వైరా వంటి ఉప నదులు, జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాల్లోని చెరువులే వాటికి ఆశ్రయాలు. ఆస్ట్రేలియా, శ్రీలంక తదితర దేశాల నుంచి వచ్చే పక్షుల హంగామాని ప్రకృతి ప్రేమికులు ఆస్వాదిస్తున్నారు. వాటి అందాలను కొందరు తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. పక్షులు విహరించే ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. ‘ప్రకృతి అందాలు, పక్షులకు ఫొటోలు తీసే అలవాటు ఉన్న నేను ఉద్యోగరీత్యా జగ్గయ్యపేటకు వచ్చినప్పుడు ఊర చెరువు వద్దకు వచ్చే పక్షులకు చాలా ఫొటోలు తీశాను. వందల రకాల కొత్త పక్షులు ఇక్కడ కనిపించాయి. వచ్చిన అరుదైన పక్షులను కాపాడుకుంటే, ఆయా ప్రాంతాలు అది మంచి పర్యాటక వనరుగా మారుతాయి’ అని హైదరాబాద్‌కు చెందిన ఎల్‌ఐసీ అధికారి దాసరి విజయ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని