భూమి ఖాళీ చేయమన్నారని రైతులపై కత్తులతో దాడి
కౌలుకు తీసుకున్న వ్యవసాయ భూమిని ఖాళీ చేయమని అడిగిన రైతులపై ఓ వ్యాపారి అనుచరులతో కలిసి కత్తులు, కొడవళ్లు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన శంషాబాద్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఆర్జీఐఏ
చికిత్స పొందుతున్న రైతు
శంషాబాద్,న్యూస్‌టుడే: కౌలుకు తీసుకున్న వ్యవసాయ భూమిని ఖాళీ చేయమని అడిగిన రైతులపై ఓ వ్యాపారి అనుచరులతో కలిసి కత్తులు, కొడవళ్లు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన శంషాబాద్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఆర్జీఐఏ పోలీసులు, బాధితులు తెలిపిన కథనం ప్రకారం.. శంషాబాద్‌కు చెందిన కె.శివానంద్‌రెడ్డి, కె.జయపాల్‌రెడ్డిలకు చారినగర్ సమీపంలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని హైదరాబాద్, చాంద్రాయణగుట్టకు చెందిన సయ్యద్ బిన్ అహ్మద్ రెండేళ్ల కోసం కౌలుకు తీసుకొని కోళ్లు, మేకల వ్యాపారం చేస్తున్నాడు. గడువు తీరినా భూమిని ఖాళీ చేయలేదు. ఈ క్రమంలో మంగళవారం శివానంద్‌రెడ్డి, జయపాల్‌రెడ్డి, ఏ.వెంకట్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, సంక్రాంతి పండుగ కోసం వీరి ఇంటికి వచ్చిన బంధువులు విఠల్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం) ఎ.జయపాల్‌రెడ్డి (సిద్ధాపూర్), శంషాబాద్‌కు చెందిన తాజ్‌బాబా మరో ఇద్దరు కలిసి వ్యవసాయ భూమి వద్దకు వెళ్లారు. వారిని చూసి ఆగ్రహంతో సయ్యద్ బిన్ అహ్మద్ తన అనుచరులు 10 మందితో కలిసి కత్తులు, కొడవళ్లు, రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. గాయపడిన తొమ్మిది మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
[ 18-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
ఆన్‌లైన్‌లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
[ 18-04-2024]
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
[ 18-04-2024]
రాష్ట్రానికి ఇప్పటివరకు భాజపా ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్‌రెడ్డి
[ 18-04-2024]
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
[ 18-04-2024]
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
ఆపరేషన్ మల్కాజిగిరి
[ 18-04-2024]
లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్‌సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. -
పరాజయానికి వెరవక.. లక్ష్యం వీడక
[ 18-04-2024]
వారిది పేద కుటుంబం. నాన్న పడిన కష్టాలు దగ్గరుండి చూసిన ఆ యువకుడు ఉన్నతాశయమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుతూ ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో సాధన చేశాడు. -
సత్వరం జనన, మరణ ధ్రువ పత్రాల మంజూరు
[ 18-04-2024]
పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది. -
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య
[ 18-04-2024]
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర కాలనీలో నివాసముండే గుంటి శ్రీనివాస్(38) గతంలో ఆర్మీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు -
డ్రగ్స్‌కు బానిసై.. విక్రయాల బాట
[ 18-04-2024]
ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే మాదకద్రవ్యాలకు బానిసైన ఆ యువకుడు విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కాడు -
వోగ్ స్టార్ మిసెస్ ఇండియా రన్నరప్‌గా స్నేహాపాటిల్
[ 18-04-2024]
హైదరాబాద్‌కు చెందిన స్నేహా పాటిల్ వోగ్ స్టార్ మిసెస్ ఇండియా - 2024 రన్నరప్‌గా నిలిచారు. ఏప్రిల్ 14న జైపూర్‌లో నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా 70 మంది పాల్గొన్నారు -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.14.31 కోట్లు స్వాధీనం
[ 18-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ తెలిపారు -
నగరానికి శోభ.. రామమయం యాత్ర
[ 18-04-2024]
వీధులన్నీ రామనామంతో మార్మోగాయి.. కాషాయ జెండాలు రెపరెపలాడాయి.. భాగ్యనగర శ్రీరామ నవమి ఉత్సవ సమితి, శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శోభాయాత్రలు నిర్వహించారు -
అదే జోరు.. సాగాలి కారు
[ 18-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లే రాజధాని పరిధిలో నాలుగు లోక్‌సభ స్థానాల్లో కనీసం మూడింటిలోనైనా గులాబీ జెండా ఎగరేయాలని భారాస గట్టి ప్రయత్నాలు చేస్తోంది -
నేటి నుంచే నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
నాలుగు లోక్‌సభ, కంటోన్మెంట్ శాసనసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కాబోతోంది. -
గ్రేటర్ పరిధిలో 5 లక్షల ఓట్ల తొలగింపు
[ 18-04-2024]
గ్రేటర్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాలను సవరించి ఐదు లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు బల్దియా కమిషనర్ రోనాల్డ్‌రాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సంరక్షణపై నీలినీడలు
[ 18-04-2024]
బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్ హోమ్ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్ హోమ్ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది. -
బైకును 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
[ 18-04-2024]
లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్ సదన్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రూ.70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాల చోరీ
[ 18-04-2024]
ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. -
మహిళా ఎస్సై సస్పెన్షన్
[ 18-04-2024]
కేపీహెచ్‌బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్ కమిషనర్ సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు -
ఎన్నికల సమగ్రసమాచారం.. ఓటరుకు ఉపయుక్తం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
తాజా వార్తలు (Latest News)
-
రుణం కోసం.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్‌పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్‌సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
-
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్