logo

అదుపుతప్పి కారు బోల్తా.. ఇద్దరికి గాయాలు

అదుపుతప్పి కారు బోల్తాపడటంతో ప్రయాణికుల్లో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని మాధవరం శివారులో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం

Published : 19 Jan 2022 04:35 IST

నగదు అందజేసి నిజాయతీ చాటుకున్న 108 సిబ్బంది

సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో బాధితులకు నగదును అందజేస్తున్న 108 సిబ్బంది

మునగాల గ్రామీణం, న్యూస్‌టుడే: అదుపుతప్పి కారు బోల్తాపడటంతో ప్రయాణికుల్లో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని మాధవరం శివారులో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన నాగేశ్వరరావు, నాగరాజు, వెంకటేశ్వర్లు వారం కిందట సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని స్వగ్రామానికి వెళ్లారు. పని ముగిసిన తర్వాత ముగ్గురు కలిసి మంగళవారం కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మాధవరం సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పింది. కాల్వలో దూసుకెళ్లింది. ప్రమాదంలో నాగేశ్వరరావు, నాగరాజు గాయపడ్డారు. స్థానికులు గమనించి  108కు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స నిర్వహించి సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. మూడో వ్యక్తి సైతం వీరితో వైద్యశాలకు వచ్చారు. అయితే కారు లో బాధితులు మర్చిపోయిన రూ.3.50 లక్షల నగదు, 6 బంగాలు ఉంగరాలు, బ్రాస్‌లెట్‌లను గుర్తించి భద్రపరిచారు. ఇవి వారివే నని ధ్రువీకరించుకు ని ఆస్పత్రిలో 108 ఈఎంటీ ముత్తయ్య, ఫైలట్‌ కన్నయ్య అందజేశారు. బాధితులు వీరికి అభినందనలు  తెలిపారు. ఈ విషయమై ఎస్సై ఎన్‌ బాలునాయక్‌ను మాట్లాడుతూ తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని