Wanaparthy: సుబ్బన్నా..ఇదేందన్నా..

బతుకుదెరువు కోసం గ్రామానికి వచ్చి.. గ్రామానికి సంబంధించిన 116 ఎకరాల భూమిని కబ్జాచేసిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది.

Published : 17 Nov 2021 20:32 IST

వనపర్తి: బతుకుదెరువు కోసం గ్రామానికి వచ్చి.. గ్రామానికి సంబంధించిన 116 ఎకరాల భూమిని కబ్జాచేసిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. చిన్నంబావి మండలం కొప్పునూరు గ్రామానికి చెందిన 116 ఎకరాల భూమిని ఓ వ్యక్తి కబ్జా చేయడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. రికార్డుల్లో పేరు మార్చి.. దామగట్ల సుబ్బన్న పేరు ఎక్కించారని గ్రామస్తులు తెలిపారు. రాజకీయ నాయకుల అండదండలతో పేరు మార్చుకున్నారని ఆరోపించారు. భూమి విషయాన్ని ప్రస్తావిస్తే నోటీసులు జారీచేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామానికి సంబంధించిన భూమి తిరిగి గ్రామానికి వచ్చే వరకు పోరాటం చేస్తామని గ్రామస్థులు స్పష్టంచేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని