గిన్నిస్‌బుక్‌కు ఎక్కనున్న గుంటూరు చిన్నారి

అద్భుత ప్రతిభ కనబర్చిన తొమ్మిదేళ్ల చిన్నారి ప్రతిష్ఠాత్మక గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటుసంపాదించుకోనుంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన తొమ్మిదేళ్ల ఫజీలా తబస్సుం ఆవర్తన పట్టికను అతి తక్కువ సమయంలో....

Updated : 25 Mar 2021 06:00 IST

చిలకలూరిపేట: అద్భుత ప్రతిభ కనబర్చిన తొమ్మిదేళ్ల చిన్నారి ప్రతిష్ఠాత్మక గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటుసంపాదించుకోనుంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన తొమ్మిదేళ్ల ఫజీలా తబస్సుం ఆవర్తన పట్టికను అతి తక్కువ సమయంలో అమర్చి గిన్నిస్‌బుక్‌ ప్రతినిధులను అబ్బురపరిచింది. త్వరలోనే చిన్నారి పేరును గిన్నిస్‌బుక్‌లో అధికారికంగా ప్రకటించనున్నారు. ఫజీలా తబస్సుం ఇప్పటికే ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటుసంపాదించుకొంది. ఎమ్మెల్యే విడదల రజిని సమక్షంలో 1.27 నిమిషాలలో మూలకాలను అమర్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా చిన్నారిని ఎమ్మెల్యే సత్కరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని