డిసెంబర్‌లో మరోసారి లాక్‌డౌన్‌.. నిజమెంత?

కరోనా వైరస్‌ కేసులతో సమానంగా దానికి సంబంధించిన పుకార్లు కూడా వ్యాప్తిస్తున్నాయి.

Updated : 13 Nov 2020 18:21 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తితో సమానంగా దానికి సంబంధించిన అసత్య ప్రచారాలు కూడా అంతే వేగంగా వ్యాపిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. దీంతో ఏది నిజం, ఏది అబద్దం తెలుసుకోలేక ప్రజలు అయోమయానికి గురౌతున్నారు. తాము అధికారికంగా ధ్రువీకరించే వరకు ఏ విధమైన సమాచారాన్నీ విశ్వసించొద్దంటూ ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేయటం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో కరోనా కట్టడికి దేశంలో డిసెంబర్‌ 1 నుంచి మరోసారి లాక్‌డౌన్‌ ను విధించనున్నారనే సమాచారం తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీన్ని అసత్య ప్రచారం మాత్రమేనని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) స్పష్టం చేసింది. ‘‘కొవిడ్‌-19 కేసులు తీవ్రమౌతున్న కారణంగా ప్రభుత్వం దేశంలో డిసెంబర్‌ 1 నుంచి మరోసారి లాక్‌డౌన్‌ విధించనుందని.. ఓ ప్రముఖ మీడియా సంస్థ సామాజిక మాధ్యమాల్లో ప్రచురించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ట్వీట్‌ నకిలీది. ప్రభుత్వం ఆ విధమైన నిర్ణయాలేవీ తీసుకోలేదు’’ అని పీఐబీ ట్విటర్‌ ద్వారా ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని