INPICS: కాలిఫోర్నియాలో కార్చిచ్చు ఉద్ధృతి 

అమెరికాలోని కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు మంటల ఉద్ధృతి కొనసాగుతోంది. కార్చిచ్చు కారణంగా ఎగసిపడ్డ మంటలను అదుపులోకి తెచ్చేందుకు హెలికాఫ్టర్‌......

Published : 12 Sep 2020 14:34 IST

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు మంటల ఉద్ధృతి కొనసాగుతోంది. కార్చిచ్చు కారణంగా ఎగసిపడ్డ మంటలను అదుపులోకి తెచ్చేందుకు హెలికాఫ్టర్‌, అగ్నిమాపక శకటాల ద్వారా సిబ్బంది నిరంతరం ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ మంటలు మాత్రం అదుపులోకి రావడంలేదు. కార్చిచ్చుతో రేగిన మంటల తీవ్రతకు అనేక భారీ భవంతులు సైతం కాలి బూడిదయ్యాయి. ఘటనలో అనేక మంది ప్రజలు గల్లంతయ్యారు. వేల సంఖ్యలో వాహనాలు, సుమారు 6,27,000ఎకరాలు అగ్నికి ఆహుతైనట్లు కాలిఫోర్నియా అధికారిక విభాగం వెల్లడించింది. 

కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకు పది మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. సుమారు ఐదు లక్షల మందిని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. అగ్నికీలలు నుంచి వెలువడిన దట్టమైన పొగ కారణంగా అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది. నీలిరంగులో ఉండాల్సిన ఆకాశం నారింజ రంగులోకి మారింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇవి..

 మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్న సిబ్బంది

మంటల తీవ్రతకు కాలి బూడిదైన భవంతులు, వాహనాలు

నారింజ రంగులోకి మారిన ఆకాశం

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని