వైరల్‌: కళ్లముందే విరిగిపడిన కొండచరియ

ఈ వీడియో రెండు రోజుల్లోనే 27 లక్షలకు పైగా కేవలం  వ్యూస్‌ను స్వంతం చేసుకుంది.

Updated : 20 Nov 2020 14:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారీ వర్షాలు లేదా భూకంపాలు సంభవించినప్పుడు కొండచరియలు విరిగి పడడం మనం చూస్తుంటాం. అలాంటిదేమీ లేకుండానే ఓ భారీ కొండచరియ విరిగి పడింది. సముద్ర తీరంలో సంభవించిన ఈ ఘటనతో కలకలం రేగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇటీవల స్పెయిన్‌లోని కానరీ ద్వీపంలోని లా గొమేరియా బీచ్‌లో సంభవించింది.

ఇక్కడి సముద్రం ఒడ్డున ఉన్న ఎత్తైన కొండ నుంచి కొంత మేరకు విడివడి నీటిలో పడిపోయింది. ఈ అనూహ్య ఘటనను ఓ ప్రత్యక్ష సాక్షి తన కెమెరాలో బంధించాడు. తొలుత కొద్దిగా మట్టి, రాళ్లు పడటం ఈ వీడియోలో చూడొచ్చు. అక్కడికి కొద్ది క్షణాల్లోనే పెద్ద భాగం సముద్రంలోకి కుప్పకూలిపోయింది. అనంతరం ఆ ప్రదేశంలో భద్రతా సిబ్బంది, జాగిలాల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించారు. ఇలాంటి ఘటన పునరావృతం కావచ్చని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. కానరీ ద్వీపాల అధ్యక్షుడు షేర్‌ చేసిన ఈ వీడియో కొన్ని లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఆ దృశ్యాన్ని మీరూ చూసేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని