కరోనా.. గర్భిణీకి వైద్యం అందించడానికి నిరాకరణ

కశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన మహిళ కాన్పు కోసం అక్కడి బందీపొర జిల్లాలో ఉన్న ఆసుపత్రిలో చేరారు. మహిళకు కొంతసేపటికి పురిటినొప్పులు రావడంతో వైద్యం చేయడానికి కరోనాతో పాటు కొన్ని పరీక్షలు చేయించమని ఆమె కుటుంబ సభ్యులకు

Published : 14 Nov 2020 20:45 IST

ఆసుపత్రి గేటు వద్ద ప్రసవించిన మహిళ

జమ్మూకశ్మీర్‌ : కశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన మహిళ కాన్పు కోసం అక్కడి బందీపొర జిల్లాలో ఉన్న ఒక ఆసుపత్రిలో చేరారు. మహిళకు కొంతసేపటికి పురిటినొప్పులు రావడంతో వైద్యం చేయడానికి కరోనాతో పాటు కొన్ని పరీక్షలు చేయించమని ఆమె కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ఆ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో గర్భిణీకి వైద్యసేవలు అందించడానికి నిరాకరించిన వైద్యులు అక్కడికి 25 కిమీ దూరంలో ఉన్న మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఆమె బంధువులు మహిళను వైద్యులు సూచించిన ఆసుప్రతికి తీసుకెళ్లే సమయంలో పురిటినొప్పులు తీవ్రంగా వచ్చాయి. 

ఆసుపత్రి గేటు సమీపంలో మహిళ తీవ్రనొప్పులతో బాధపడుతుండటంతో అక్కడ ఉన్న కొందరు మహిళలు దుప్పట్లు తీసుకొచ్చి పురిటినొప్పులతో అల్లాడుతున్న మహిళ చుట్టూ ఉంచారు. కొద్దిసేపటికి మహిళ ప్రసవించారు. గర్భంతో ఉన్న మహిళ అంత బాధపడుతున్నా ఒక్క వైద్యుడు కూడా వైద్యం అందించడానికి ముందుకు రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యులకు వ్యతిరేకంగా పలువురు నిరసన తెలిపారు. దీంతో స్పందించిన సంబంధిత అధికారి ఆసుపత్రి వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమానవీయంగా ప్రవర్తించిన వైద్యులపై కఠిన చర్యలకు ఆదేశించినట్లు ఆయన వివరించారు. 

  

  
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని