దేశరక్షణలో డీఆర్‌డీవోది కీలకపాత్ర 

భారతదేశాన్ని ఒక అత్యున్నత శక్తిగా నిలిపేందుకు డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో) కీలకపాత్ర పోషిస్తోందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు.

Updated : 18 Dec 2020 22:53 IST

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

దిల్లీ: భారతదేశాన్ని ఒక అత్యున్నత శక్తిగా నిలిపేందుకు డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో) కీలకపాత్ర పోషిస్తోందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. శుక్రవారం డీఆర్‌డీవో అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మల్టీరోల్‌ ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ తేజస్‌, బాలిస్టిక్‌ మిసైల్‌ సిస్టమ్స్‌ సహా విజయవంతమైన అనేక రక్షణ వ్యవస్థలను డీఆర్‌డీవో పరీక్షించిందన్నారు. దేశ సాయుధ దళాల సామర్థ్యాన్ని పెంచడంలో డీఆర్‌డీవో సహకరించిందన్నారు. ‘‘సరిహద్దుల్లో మనం ఎదుర్కొంటున్న సవాళ్లు మన శక్తికి పరీక్షగా నిలుస్తున్నాయి. మన ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ సరిహద్దుల వద్ద వనరుల కొరత లేకుండా చూస్తారన్న నమ్మకం నాకుంది.’’ అని రక్షణ మంత్రి తెలిపారు. త్రివిధ దళాధిపతి బిపిన్‌రావత్‌ మాట్లాడుతూ..  భవిష్యత్‌ పరిస్థితులను అంచనా వేస్తూ డీఆర్‌డీవో స్వదేశీ పరిజ్ఞానంతో ఆయుధాలను తయారు చేస్తోందన్నారు. గత కొన్నేళ్లుగా డీఆర్‌డీవో సాయంతో దేశ రక్షణ వ్యవస్థ శక్తివంతంగా తయారైందన్నారు. ఈ కార్యక్రమంలో రక్షణమంత్రి డీఆర్‌డీవో తయారు చేసిన ఇండియన్‌ మారిటైమ్‌ సిట్యుయేషనల్‌ అవేర్‌నెస్‌ సిస్టంను నౌకాదళాధిపతి అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌కు, అస్త్ర ఎమ్‌కే మిసైల్‌ను వాయుసేనాధిపతి ఎయిర్‌ఛీఫ్‌ మార్షల్‌ రాకేశ్‌కుమార్‌ సింగ్‌ బదూరియాకు, బోర్డర్‌ సర్వేలెన్స్‌ సిస్టం (బాస్‌)ను ఆర్మీ ఛీఫ్‌ జనరల్‌ మనోజ్‌ముకుంద్‌ నర్వాణేకు అందించారు.

ఇవీ చదవండి..

గగనతలంలో నిఘా నేత్రాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని