బోరుమనిపిస్తున్న బోర్లు!

కరువు సీమ అనంతపురంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. వేలు ఖర్చు చేసి బోర్లు వేసినా చుక్క నీరు కూడా రాకుండటంతో..

Updated : 29 Jun 2023 18:18 IST

అనంతపురంలో ఆగని అన్నదాతల ఆత్మహత్యలు

ఇంటర్నెట్‌డెస్క్‌: కరవు సీమ అనంతపురంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. వేలు ఖర్చు చేసి బోర్లు వేసినా చుక్క నీరు కూడా రాకపోవడంతో రైతన్నలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. వందల అడుగుల లోతులో బోరు వేసినా నీరు ఉండకపోవడంతో కలత చెందుతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురై తనువు చాలిస్తున్నారు. దీంతో వారి కుటుంబాలకు శోకం మిగుల్చుతున్నారు.

ఈ ఒక్క నెలలోనే అనంతపురం జిల్లాలో ఆరుగురు రైతన్నలు ఆత్మహత్యకు పాల్పడ్డారంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఇచ్చే పరిహారాన్ని రూ.7 లక్షలకు పెంచుతూ 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 50 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా అందులో 33 మందిని మాత్రమే ప్రభుత్వం పరిహారానికి అర్హులుగా పేర్కొంది. రైతులు అధిక సంఖ్యలో బోర్లు వేయడం, నీరు పడకపోవడమే బలవన్మరణాలకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు. పెద్ద ఎత్తున బోర్లు వేయడం మానుకోవాలని సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని