తలకు గాయం.. ఎప్పుడు ప్రాణాంతకం..!

బైక్‌ మీద వెళ్లేటప్పుడు హెల్మెట్‌ ధరించండి. కారులో వెళ్లేటప్పుడు సీట్‌ బెల్ట్‌ పెట్టుకోండి. ఇలాంటి మాటలు తరచూ వింటూనే ఉంటాం. కానీ.. ఆ మాటలను ఆచరణలో పెట్టేవారెందరు? అంటే సమాధానం చెప్పటం అంత సులువేం కాదు.

Published : 15 Dec 2020 01:48 IST


 


ఇంటర్నెట్‌ డెస్క్‌ : బైక్‌ మీద వెళ్లేటప్పుడు హెల్మెట్‌ ధరించండి. కారులో వెళ్లేటప్పుడు సీట్‌ బెల్ట్‌ పెట్టుకోండి. ఇలాంటి మాటలు తరచూ వింటూనే ఉంటాం. కానీ.. ఆ మాటలను ఆచరణలో పెట్టేవారెందరు? అంటే సమాధానం చెప్పటం అంత సులువేం కాదు. సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా వాహనాలను నడిపే సమయంలో అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే తలకు తీవ్రమైన గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. శరీరంలోని మిగతా భాగాలకు గాయాలు కావటం వేరు, తలకు గాయాలు కావటం వేరు. తలకు దెబ్బలు తగిలినపుడు సకాలంలో వైద్యం అందకపోతే ఏకంగా ప్రాణాలే పోవచ్చు. మరి ఈ గాయాల గురించి నిపుణులు ఏమంటున్నారో మీరూ తెలుసుకోండి!

ప్ర : తలకు ఎన్ని రకాలుగా గాయాలు కావచ్చు?
జ: రోడ్డు ప్రమాదాలు, ఎత్తైన ప్రదేశాల (బిల్డింగ్‌, చెట్లు వంటివి) నుంచి కిందికి పడినపుడు. ఇతరులు దాడిచేసినపుడు. కాల్పులు తదితరాల వల్ల తలకు గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఆటలు ఆడే సమయంలోనూ ఈ రకమైన గాయాలు కావటానికి ఆస్కారం ఉంది.

ప్ర: రక్తం కనిపించకపోతే ప్రమాదం లేదనుకోవటం సరైందేనా?
జ: కొంతమందిలో బయటకు ఏమాత్రం గాయం కనిపించకపోయినా మెదడు ఎక్కువ మోతాదులో దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. రక్తం బయటకు కనిపించలేదు కదా అని నిర్లక్ష్యం చేయటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. గాయాలు కనిపించకపోయినా కోమాలోకి వెళ్లేంత ప్రమాదం జరిగి ఉండొచ్చు. కొన్నిసార్లు రక్తం బయటకు కనిపించినా అది తీవ్రస్థాయి ప్రమాదం కాకపోయి ఉండొచ్చు. అందువల్ల ముందుగానే ఓ అంచనాకు రావటం సరైందికాదు. ప్రమాదం జరిగినపుడు స్పృహ కోల్పోయి ఉంటే వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లటం మంచిది. 

ప్ర: తలమీద కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో దెబ్బలు తగిలితేనే ప్రమాదమని భావించటం సరైందేనా?
జ: ప్రమాదంలో ఎక్కడ దెబ్బ తగిలినా సరే.. నిర్థారణ చేసేంత వరకు దానిని తీవ్రమైనది గానే పరిగణించాలి. కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో దెబ్బ తగిలితేనే ప్రమాదం అనుకోవటం సరికాదు. వైద్యులకు కచ్చితంగా సంప్రదించాలి.

ప్ర: తలకు దెబ్బలు తగిలితే ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలి?
జ: ప్రమాదాలు జరిగినపుడు శరీరంలో ఏ భాగానికైనా గాయాలు కావొచ్చు. గాయపడిన వారిని వీలైనంత వరకు సమతలంగా ఉన్న చోట పడుకోబెట్టాలి. తల నుంచి రక్తం వస్తుందేమో చూడాలి. టవల్‌, కర్చీఫ్‌ వంటి వాటితో ఆ రక్తస్రావాన్ని ఆపేయాలి. అలా చేయటం వల్ల బీపీ పడిపోకుండా ఉంటుంది. వీలైనంత త్వరగా అంబులెన్స్‌ వచ్చేలా చేసి బాధితుడిని ఆసుపత్రికి తరలించాలి.

ఇవేకాకుండా తలకు అయిన గాయాల తీవ్రతను ఎలా తెలుసుకుంటారు? వంటి మరిన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే కింది వీడియోను వీక్షించండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని