Updated : 20/04/2021 15:23 IST

Hyderabad Metro: వేళల్లో మార్పులు

హైదరాబాద్‌: కరోనా ఉద్ధృతితో తెలంగాణ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్న నేపథ్యంలో మెట్రో రైలు సర్వీసు వేళల్లో మార్పులు జరిగాయి. ఈ మేరకు  హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ (హెచ్‌ఎంఆర్‌) ప్రకటన విడుదల చేసింది. నగరంలోని టెర్మినల్‌ మెట్రో స్టేషన్లలో చివరి మెట్రో రైలు రాత్రి 7.45 గంటలకు ఉంటుందని.. అవి గమ్యస్థానాలకు  రాత్రి 8.45గంటల్లోపు చేరుకుంటాయని తెలిపింది. ప్రతి రోజూ ఉదయం ఎప్పటిలాగే 6.30గంటలకు తిరిగి సర్వీసులు ప్రారంభమవుతాయని వెల్లడించింది. మెట్రో రైలు ప్రయాణికులు కరోనా నిబంధనలు పాటిస్తూ సిబ్బందికి సహకరించాలని హెచ్‌ఎంఆర్‌ కోరింది.  భౌతిక దూరం పాటించడం.. మాస్కులు ధరించడంతో పాటు ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రం చేసుకోవాలని సూచించింది.

 నేటి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు Curfew విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈరోజు నుంచి మే ఒకటో తేదీ ఉదయం 5గంటల వరకు ప్రతి రోజూ రాత్రి కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. రాత్రి 8 గంటలకే కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

సిటీ బస్సుల సమయాల్లో మార్పులు..

ప్రభుత్వం రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో సిటీ బస్సుల సమయ పాలనను ఆర్టీసీ కుదించింది. రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే బస్సులను నడుపుతామని ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ యాదగిరి తెలిపారు. సిటీ బస్సులు రాత్రి 9 గంటల లోపు ఆయా డిపోలకు చేరుకుంటాయని వెల్లడించారు. అంతర్‌ జిల్లాలకు వెళ్లాల్సిన బస్సులు 9 గంటలలోపు వెళ్తాయని స్పష్టం చేశారు. రాత్రి 9 తర్వాత బయలుదేరాల్సిన బస్సులు 9లోపు వెళ్లేలా సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆయా డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. మాస్కులు ధరించిన వారినే బస్సుల్లో ప్రయాణానికి అనుమతిస్తామని ఈడీ యాదగిరి తెలిపారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని