
Published : 07 Oct 2020 18:26 IST
పట్టాలెక్కనున్న మరికొన్ని రైళ్లు
దిల్లీ: కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన రైలు సర్వీసులను రైల్వే శాఖ విడతల వారీగా పునరుద్ధరిస్తోంది. తాజాగా మరికొన్ని రైళ్లను పట్టాలు ఎక్కించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు నడుస్తున్న రైలు సర్వీసులకు అదనంగా మరో 39 రైళ్లను నడిపేందుకు అన్ని రైల్వే జోన్లకు అనుమతిచ్చినట్లు తెలిపింది. వాటిలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 4 మార్గాల్లో రైళ్లకు అనుమతులు లభించాయి. సికింద్రాబాద్-శాలిమార్, లింగంపల్లి-కాకినాడ టౌన్, విశాఖ-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖ సర్వీసులు ప్రారంభించేందుకు రైల్వే శాఖ అవకాశం కల్పించింది. అనుమతి ఇచ్చిన రైళ్లను ప్రత్యేక సర్వీసులుగా నడపనున్నట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
Tags :