శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీసీ-49 నమూనా రాకెట్‌ను శ్రీవారి చెంత ఉంచారు...

Updated : 06 Nov 2020 10:45 IST

తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీసీ-49 నమూనా రాకెట్‌ను శ్రీవారి చెంత ఉంచారు.  రేపు మధ్యాహ్నం శ్రీహరికోట షార్‌నుంచి పీఎస్‌ఎల్వీసీ-49 నింగిలోకి దూసుకెళ్ల నుంది. మనదేశానికి చెందిన ఈవోఎస్‌-01తోపాటు, విదేశాలకు చెందిన 9 ఉప్రగహాలను నిర్ణీత కక్ష్యలోకి మోసుకెళ్లనుంది. దేశానికి చెందిన భూపరిశీలన ఉపగ్రహం ద్వారా వాతావరణ, వ్యవసాయ, అటవీ సంబంధ సమాచారం తెలుసుకోవచ్చు. వాహకనౌకకు రూ.175 కోట్లు, ఉపగ్రహానికి రూ. 125 కోట్ల వరకు వ్యయం చేశారు. ఈ ఏడాదిలో షార్‌ నుంచి ఇదే తొలి ప్రయోగం. కరోనా సవాళ్లను శాస్త్రవేత్తలు అధికమించి పీఎస్‌ఎల్‌వీ-సి49 వాహకనౌక ప్రయోగం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని