
Published : 01 Sep 2020 17:48 IST
గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణపయ్య
హైదరాబాద్: నగరంలో గణేశ్ నిమజ్జనాల కోలాహలం కొనసాగుతోంది. ప్రసిద్ధ ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. భక్తుల జయజయధ్వానాల నడుమ హుస్సేన్‌సాగర్‌లోని నాలుగో నంబర్ క్రేన్ వద్ద ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తయింది. కరోనా కారణంగా ఈసారి కేవలం 9 అడుగుల మట్టి విగ్రహాన్ని ఖైరతాబాద్ ఉత్సవ నిర్వాహకులు రూపొందించారు.
మరోవైపు పలు ప్రాంతాల నుంచి తరలివస్తున్న గణనాథులతో ట్యాంక్‌బండ్‌పై సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీటీవీ కెమెరాలతో కంట్రోల్ రూం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ అర్ధరాత్రి వరకు నిమజ్జనాల ప్రక్రియ కొనసాగే అవకాశముంది.
Tags :