పులికాట్లో సందడి చేస్తున్న దేవతా పక్షులు
ఏటా వచ్చే విదేశీ అతిథులు నెల్లూరు జిల్లాకు మళ్లీ పర్యాటక శోభను తీసుకొచ్చాయి. పులికాట్ సరస్సులో కొత్త కాపురానికి వచ్చిన దేవతా పక్షులు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి...
నెల్లూరు: ఏటా వచ్చే విదేశీ అతిథులు నెల్లూరు జిల్లాకు మళ్లీ పర్యాటక శోభను తీసుకొచ్చాయి. పులికాట్ సరస్సులో కొత్త కాపురానికి వచ్చిన దేవతా పక్షులు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఏడు దేశాలకు చెందిన ఈ విహంగాలు వేల కిలోమీటర్లు ప్రయాణించి పులికాట్ సరస్సుకు వస్తుంటాయి. పెలికాన్స్, గూడ బాతులు, కొంగలు వంటి 26 రకాల పక్షులు పులికాట్లో సందడి చేస్తాయి. ఐదు నెలలపాటు ఇక్కడే ఉండి సంతానోత్పత్తి చేస్తాయి. తర్వాత పిల్లలతో సహా స్వదేశాలకు ప్రయాణమవుతాయి. ఈ ఐదు నెలల పాటు రైతులు, మత్స్యకారులు, అధికారులు వాటిని సంరక్షిస్తుంటారు. దేవతా పక్షులుగా పిలుస్తూ ఎవరూ వాటికి హాని కలగనీయకుండా చూస్తారు. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి సమీపంలోనే పులికాట్ ఉండటంతో ఈ మార్గం గుండా ప్రయాణించేవారు పక్షుల సందడిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం