నెటిజన్లు బాధ్యతగా వ్యవహరించాలి: కేటీఆర్‌

సామాజిక మాధ్యమ వినియోగదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఒక తప్పుడు పోస్టు, ప్రచారం ఎంతటి అనర్థానికి దారితీస్తుందో ఆయన ట్విటర్‌ వేదికగా ఉదహరించారు. ..

Published : 12 Aug 2020 12:22 IST

హైదరాబాద్‌: సామాజిక మాధ్యమ వినియోగదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఒక తప్పుడు పోస్టు, ప్రచారం ఎంతటి అనర్థానికి దారితీస్తుందో ఆయన ట్విటర్‌ వేదికగా ఉదహరించారు. బెంగళూరులో ఓ వర్గాన్ని కించపరిచేలా సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టుల విషయంలో మంగళవారం రాత్రి చెలరేగిన అల్లర్లలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 60 మంది పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి 147 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఘటనను ఉదహరిస్తూ ‘‘ఒక బాధ్యతారహిత పోస్టు ఎంతటి అనర్థానికి దారితీస్తుందో. అవాస్తవాలు, అమర్యాదలకు పాల్పడే పోస్టుల పట్ల నెటిజన్లు జాగ్రత్త వహించాలి. సామాజిక మాధ్యమాలను సంఘవ్యతిరేక శక్తులకు వేదికగా మార్చరాదు’’ అని ట్వీట్‌ చేశారు. ఘటనకు సంబంధించిన ఫోటోలను ఈ మేరకు పోస్టు చేశారు. 

ఇదీ చదవండి..
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నివాసంపై రాళ్లదాడి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని