ప్రియుడితో వివాహం జరిపించాలని..

ప్రేమించిన ప్రియుడితో వివాహం జరిపించాలని ఓ బాలిక హోర్డింగ్‌ ఎక్కింది. తను ప్రేమించిన బాలుడితో వివాహానికి తల్లి నిరాకరించిందని, ప్రియుడితోనే తన వివాహం జరిపించాలంటూ...

Published : 10 Nov 2020 01:48 IST

హోర్డింగ్‌ ఎక్కిన బాలిక

ఇండోర్‌: ప్రేమించిన ప్రియుడితో వివాహం జరిపించాలని ఓ బాలిక హోర్డింగ్‌ ఎక్కింది. తను ప్రేమించిన బాలుడితో వివాహానికి తల్లి నిరాకరించిందని, ప్రియుడితోనే తన వివాహం జరిపించాలంటూ హోర్డింగ్‌ ఎక్కి నిరసన తెలిపింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సదరు బాలిక చేసిన ఈ పనితో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం రాత్రి ఇండోర్‌లోని పరదేసిపురలోని ఓ హోర్డింగ్‌పైకి ఎక్కిన బాలిక ఫోను చూస్తూ కనిపించింది. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు గుమిగూడారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాలికను కిందకు దించే ప్రయత్నం చేశారు. అయినా బాలిక దిగిరాకపోవడంతో ఆమె ప్రేమించిన బాలుడిని పోలీసులు ఫోనులో సంప్రదించారు. అనంతరం ఈ బాలుడు బాలికకు ఫోన్ చేయడంతో నిరసన ఉపసంహరించుకున్న మైనర్‌ కిందకు దిగివచ్చింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని