విద్యుత్ తీగల్లో శాంతాక్లాజ్‌.. ఏమైందో తెలుసా..!

డిసెంబర్ నెల రాగానే క్రైస్తవ కుటుంబాల్లో క్రిస్మస్ సందడి మొదలవుతుంది. ప్రపంచం అంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండగ రోజున  'శాంతాక్లాజ్' ఆకాశం నుంచి వచ్చి తమకు బహుమతులు ఇస్తాడని పిల్లలంతా భావిస్తుంటారు. అయితే అచ్చం అలాగే అనుకున్నాడు కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి. అందుకు శాంతాక్లాజ్‌లా దుస్తులు వేసుకొని, పారాచూట్‌ ద్వారా ఓ చిన్న విమానంలో అక్కడి వీధుల్లో చక్కర్లు కొడుతూ.

Published : 24 Dec 2020 00:11 IST

వాషింగ్టన్‌: డిసెంబర్ నెల రాగానే క్రిస్మస్ సందడి మొదలవుతుంది. ప్రపంచం అంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకొనే ఈ పండగ రోజున  'శాంతాక్లాజ్' ఆకాశం నుంచి వచ్చి తమకు బహుమతులు ఇస్తాడని పిల్లలంతా భావిస్తుంటారు. అయితే అచ్చం అలాగే అనుకున్నాడు కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి. శాంతాక్లాజ్‌లా దుస్తులు వేసుకొని, పారాచూట్‌ ద్వారా ఓ చిన్న విమానంలో అక్కడి వీధుల్లో చక్కర్లు కొడుతూ.. తనకు కనిపించిన పిల్లలకు చాక్లెట్లు ఇవ్వడం ప్రారంభించాడు. ఇంతలో శాక్రమెంటో ప్రాంతంలో ఎగురుతుండగా ఆ పారాచూట్‌ విమానం విద్యుత్‌ తీగల్లో చిక్కుకుంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. మొదట వారు స్పందించలేదు. నిత్యం ఇలాంటి ఫేక్‌ కాల్స్‌ చాలా వస్తుంటాయని పట్టించుకోలేదు. కాసేపటికే శాంతాక్లాజ్‌ విద్యుత్‌ తీగల్లో చిక్కుకున్న ఫొటోలు సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొట్టాయి. ఇది గమనించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు అక్కడికి చేరుకొని విద్యుత్ తీగల్లో చిక్కుకున్న శాంతాక్లాజ్‌ను కిందకుదించారు. ఈ ఘటనను పోలీసుశాఖ వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. కాగా అదృష్టవశాత్తూ.. ఈ ఘటనలో అతనికి కాలేదని, త్వరలోనే అతను మళ్లీ బహుమతులు తీసుకొని వస్తాడంటూ సరదా పోస్టు పెట్టింది. పిల్లల కోసం ఇలా మంచి పనులు చేయాలనుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయమని పోలీస్‌శాఖ పేర్కొంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని