అంబాలా అంబరాన రఫేల్‌ షికార్లు

రఫేల్‌ విమానాల రాకతో రక్షణ వర్గాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి.

Updated : 13 Sep 2023 15:39 IST

అంబాలా (పంజాబ్‌): తొలి విడత రఫేల్‌ విమానాల రాకతో రక్షణ వర్గాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. భారత రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే ఈ లోహవిహంగాలకు ఘనస్వాగతం లభించింది. ఇక విమానాలు ల్యాండ్‌ అయిన అంబాలా ప్రాంత ప్రజల ఉత్సాహానికి అంతే లేదు. ఈ విమానాల రాకకై స్థానికులు బుధవారం ఉదయం నుంచే ఎదురుతెన్నులు చూశారు. ఈ ఫైటర్‌ యుద్ధవిమానాలను భారీ సంఖ్యలో ప్రజలు జాతీయరహదారి పైకి చేరి మరీ తిలకించారు. ప్రతి ఒక్కరూ తమ ఊరిగురించే మాట్లాడుకుంటున్నారని, రఫేల్‌ విమానాలకు తమ పట్టణం చిరునామాగా మారడం  గర్వకారణమని స్థానికులు అంటున్నారు. ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకునేందుకు కొందరు మిఠాయిలు కూడా పంచిపెట్టారు. కాగా, రఫేల్‌ విమానాల రాక సందర్భంగా అధికారిక యంత్రాంగం పట్టణంలో కొన్ని రహదారులను మూసివేసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. వైమానిక స్థావరం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలులోకి తెచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని