నిడదవోలు రైల్వేస్టేషన్‌లో ఇదీ పరిస్థితి:వీడియో

ఏపీలోని కోస్తా జిల్లాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది. వర్షం

Updated : 13 Oct 2020 18:14 IST

నిడదవోలు: ఏపీలోని కోస్తా జిల్లాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు రైల్వేస్టేషన్‌లో నీరు నిలిచిపోయింది. ఈ ఉదయం పట్టాలపై సుమారు మీటరున్నర ఎత్తుకు పైగా వర్షపునీరు ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పట్టాలకు ఇరువైపులా గ్యాంగ్‌మెన్‌ల సాయంతో అతికష్టంమీద రైళ్లను స్టేషన్‌ దాటించారు. రైలు పట్టాలపై వారు నడుస్తుండగా వారి వెంబడి నెమ్మదిగా రైళ్లు నడిచాయి. అనంతరం అధికారులు మోటార్లు ఏర్పాటు చేసి భారీగా నిలిచిపోయిన నీటిని బయటకు పంపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని