విగ్రహానికి రాఖీ.. సోదరుడికి నివాళి

సోదరుడు మృతి చెందినా అతడిపై మమకారం మరిచిపోలేదు సోదరీమణులు. విగ్రహానికి రాఖీ కడుతూ ఏటా రక్షాబంధన్‌ నిర్వహించుకుంటున్నారు. తమ సోదరుడి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

Updated : 29 Nov 2023 12:26 IST

సిద్దిపేట: సోదరుడు మృతి చెందినా అతడిపై మమకారం మరిచిపోలేదు సోదరీమణులు. విగ్రహానికి రాఖీ కడుతూ ఏటా రక్షాబంధన్‌ నిర్వహించుకుంటున్నారు. తమ సోదరుడి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.  
    సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం రాజుతండాకు చెందిన గుగులోతు లింగయ్య, వీరమ్మ దంపతులకు నలుగురు సంతానం. కుమారుడు నరసింహనాయక్‌ సీఆర్‌పీఎఫ్ జవాన్‌గా పని చేసేవారు. 2014లో చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు బలయ్యాడు. అతని గుర్తుగా తల్లిదండ్రులు పొలం వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల రోజున జాతీయ పతాకం ఎగురవేస్తూ కుమారుడికి నివాళి అర్పిస్తున్నారు.  రాఖీ పండుగ వచ్చిందంటే  ముగ్గురు సోదరీమణులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సోదరుడి విగ్రహానికి రాఖీ కట్టి అనుబంధాన్ని చాటుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని