‘అల’వోకగా గిన్నిస్‌ రికార్డు బద్దలు.. వైరల్‌ వీడియో

73.5 అడుగుల అతి పెద్ద అలపై సర్ఫింగ్‌ చేయటం ద్వారా ఆమె ఈ ఘనత సాధించింది.

Published : 12 Sep 2020 19:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రెజిల్‌ కు చెందిన మాయా గబేరియా అనే యువతి సర్ఫింగ్‌లో తాను నెలకొల్పిన గిన్నిస్‌ రికార్డును తానే బద్దలు కొట్టింది. 73.5 అడుగుల అతి పెద్ద అలపై సర్ఫింగ్‌ చేయటం ద్వారా ఆమె ఈ ఘనత సాధించింది. కాగా.. ఇదివరకు ఉన్న 68 అడుగుల రికార్డు కూడా ఆమె నెలకొల్పిందే కావటం విశేషం.

దీనికి సంబంధించిన 40 సెకెన్ల వీడియో నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. నాలుగంతస్తుల భవనం కంటే ఎత్తయిన అలపై మాయా చేసిన సర్ఫింగ్ విన్యాసాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. దీనిని చూసి ‘‘వావ్‌.. అద్భుతం.. కంగ్రాట్స్‌.. వాటే థ్రిల్‌ మాయా...’’ అంటున్న వారి పొగడ్తలు సాగర ఘోషను మించిపోతున్నాయి. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని