సైకత శిల్పంతో గానగంధర్వుడికి నివాళి

ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ గానగంధర్వుడు, స్వర సామ్రాట్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఘన నివాళి అర్పించారు.

Published : 26 Sep 2020 17:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ గానగంధర్వుడు, స్వర సామ్రాట్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఘన నివాళి అర్పించారు. ఒడిశాలోని పూరి సముద్ర తీరంలో ఎరుపు రంగు లాల్చీ, కండువా ధరించిన బాలు సైకత శిల్పాన్ని తీర్చిదిద్దిన సుదర్శన్‌ పట్నాయక్‌ లెజండరీ నేపథ్య గాయకుడికి అంజలి ఘటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సైకత శిల్పం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఎస్పీబీకి అక్షర నివాళి

ఎస్పీబీ మృతికి ఒక్కొక్కరూ ఒక్కో రూపంలో ఘన నివాళి అర్పిస్తున్నారు. విజయవాడ గాంధీ నగర్‌కు చెందిన జోస్యుల వేణుగోపాల్‌ అక్షర నివాళి అర్పించారు. బాలు పాడిన పాటలతో ఆయన రూపాన్ఇన తీర్చిదిద్దారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఈ చిత్రం వైరల్‌ అయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని