పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం: మేకపాటి

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ స్వర్గధామమని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. తైవాన్‌ కంపెనీల ప్రతినిధులతో ఆయన ఇవాళ సమావేశమయ్యారు. ఫోక్స్‌లింక్‌, అపాచి, పీఎస్‌ఏ ..

Published : 07 Nov 2020 01:27 IST

అమరావతి: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ స్వర్గధామమని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. తైవాన్‌ కంపెనీల ప్రతినిధులతో ఆయన ఇవాళ సమావేశమయ్యారు. ఫోక్స్‌లింక్‌, అపాచి, పీఎస్‌ఏ వాల్సిన్‌, గ్రీన్‌టెక్‌ ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఈజ్ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే ఏపీ తొలిస్థానంలో ఉందన్నారు. విద్య, వైద్యం, సాగు పరిశ్రమ రంగాల్లో అనేక సంస్కరణలు చేపట్టామన్నారు. తీర ప్రాంతంతోపాటు ఏపీలో మౌలిక సదుపాయాలు విస్తృతంగా ఉన్నాయన్నారు. కడప జిల్లాలో ఎలక్ట్రానిక్‌ మేనిఫేక్చరింగ్‌ క్లస్టర్‌ అభివృద్ధి చేస్తామని చెప్పారు. మూడు పరిశ్రామిక కారిడార్లు, 8 హార్బర్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు వివరించారు. తైవాన్‌ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వారి భాగస్వామ్యంతో రాష్ట్రంలో మరింత పారిశ్రామిక అభివృద్ధి సాధిస్తామని గౌతమ్‌రెడ్డి అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని