బడ్జెట్‌: మీ సలహాలు ఏంటి?

2021-22 వార్షిక బడ్జెట్‌లో మీ ఆలోచనలూ పంచుకొనేందుకు ప్రభుత్వం అవకాశాన్ని కల్పిస్తోంది. దీని కోసం మైజీవోవీ అనే ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫాంను ఏర్పాటు చేసింది. సాధారణ ప్రజలెవరైనా  బడ్జెట్‌లో పెట్టాలనుకున్న కొత్త ఆలోచనలను ప్రభుత్వం స్వాగతిస్తోంది. ఈ పోర్టల్‌ నవంబరు 15న ప్రారంభమైంది.

Published : 28 Nov 2020 23:14 IST

దిల్లీ: 2021-22 వార్షిక బడ్జెట్‌లో ప్రజల ఆలోచనలూ పంచుకొనేందుకు ప్రభుత్వం అవకాశాన్ని కల్పిస్తోంది. దీని కోసం మైజీవోవీ అనే ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫాంను ఏర్పాటు చేసింది. సాధారణ ప్రజలెవరైనా బడ్జెట్‌లో పెట్టాలనుకున్న కొత్త ఆలోచనలను ప్రభుత్వం స్వాగతిస్తోంది. ఈ పోర్టల్‌ నవంబరు 15న ప్రారంభమైంది. నవంబరు 30 వరకు ప్రజలు వారి అభిప్రాయాలు, ఆలోచనలను పంచుకోవచ్చు. వారి సూచనలు మెరుగైనవి అయితే వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో వాటిని చర్చించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ట్వీట్‌లో తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ ట్విటర్‌ అకౌంట్‌లో శనివారం పోస్టు చేశారు.

దేశ ప్రజలను అన్నింటిలో భాగస్వాములుగా చేయడమే ప్రజాస్వామ్యానికి మూలం ఆర్థికశాఖ తెలిపింది. ఏటా బడ్జెట్‌ సమావేశాలకు ముందు ప్రజల అభిప్రాయాలు, సూచనలు సేకరిస్తోంది. మైజీవోవీ.ఇన్‌లో అభిప్రాయాలు తెలియజేసేందుకు ముందుగా లాగిన్‌ అవ్వాలి. అందుకోసం మీ పేరు, రాష్ట్రం, ఈ-మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నెంబరు, ఏ అంశంలో మీ ఆలోచన పంచుకోవాలని అనుకుంటున్నారో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. 500 పదాలకు మించకుండా మీ ఆలోచనలు ఆ పోర్టల్‌లో సమర్పించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని