Ts news : ఎర్రబెల్లి కారుకు త్రుటిలో తప్పిన ప్రమాదం

తొర్రూరు నుంచి జనగాం వైపునకు వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కారుకు శుక్రవారం సాయంత్రం త్రుటిలో ప్రమాదం తప్పింది. మంత్రి కాన్వాయ్‌ కొడకండ్లలోని

Updated : 06 Aug 2021 22:06 IST

కొడకండ్ల: తొర్రూరు నుంచి జనగాం వైపునకు వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కారుకు శుక్రవారం సాయంత్రం త్రుటిలో ప్రమాదం తప్పింది. మంత్రి కాన్వాయ్‌ కొడకండ్లలోని హక్యా తండా సమీపంలోకి చేరుకుంటుండగా.. ఇనుప చక్రాల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ నుంచి ఒక చక్రం అకస్మాత్తుగా రోడ్డుపై పడింది. అప్పటికే మంత్రి కారు దాటుకుని వెళ్లిపోగా వెనుక ఉన్న బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని తాకి రోడ్డుపై పడిపోయింది. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనానికి కొంత నష్టం కలిగింది. కొద్దిదూరం వెళ్లిన మంత్రి.. వాహనానికి ప్రమాదం జరిగిందని తెలుసుకొని వెనక్కు వచ్చారు. చిన్న సంఘటనతో ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని తెలుసుకున్న మంత్రి తిరిగి కాన్వాయ్‌తో జనగాం వైపు వెళ్లారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని