Anand Mahindra: న్యూయార్క్‌లో స్టీల్‌ డబ్బా..అవాక్కవుతున్న నెటిజన్లు!

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉంటారు

Updated : 20 Aug 2021 18:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉంటారు. అప్పుడప్పుడు ఆసక్తికరమైన కామెంట్లతో వీడియోలు, ఫొటోలను ట్వీట్‌ చేస్తుంటారు.  తాజాగా ఆయన న్యూయార్క్‌లో తీసిన ఓ ఫొటోను ట్విటర్‌లో పంచుకొన్నారు. ప్రస్తుతం అది నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఓ యువతి స్టీల్‌ డబ్బా పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నట్లు ఆ ఫొటోలో కనిపిస్తోంది. ‘న్యూయార్క్‌, సెంట్రల్‌ పార్క్‌. డబ్బావాలీ’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఇందులో ఆమె ముఖం కనిపించలేదు. కానీ, ఆ యువతి ఫార్మల్‌ డ్రెస్‌ వేసుకొని ఉద్యోగానికి వెళ్తున్నట్లుగా ఉంది. ఆమె చేతిలో ఉన్న స్టీల్ టిఫిన్ డబ్బానే అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. వీటిని భారత్‌లోనే ఎక్కువగా ఉపయోగిస్తారు. అమెరికాలోనూ ఈ డబ్బాలను వినియోగిస్తారని తెలుసుకొని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని