Anand Mahindra: మన వాళ్లని తక్కువ అంచనా వేయొద్దు సుమీ!

వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో నిత్యం చురుగ్గా ఉంటూ.. సరికొత్త విషయాలు నెటిజన్లతో పంచుకుంటారన్న సంగతి తెలిసిందే. అందులో కొన్ని స్ఫూర్తిదాయకమైనవైతే.. మరి కొన్ని ఫన్నీగా ఉంటాయి. తాజాగా ఆయన ‘‘కెలాగ్స్‌ ఉమ్మా’’ మీద పోస్టు చేసిన మీమ్‌ నెట్టింట నవ్వులు పూయిస్తుంది. విషయానికొస్తే.. సరిగ్గా పదేళ్ల క్రితం ‘‘కేలాగ్స్’’ అనే అమెరికా ఆహార ఉత్పత్తి సంస్థ భారత్‌లో అడుగుపెట్టింది. ప్రారంభంలోనే.

Updated : 20 Sep 2021 16:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో నిత్యం చురుగ్గా ఉంటూ.. సరికొత్త విషయాలు నెటిజన్లతో పంచుకుంటారన్న సంగతి తెలిసిందే. అందులో కొన్ని స్ఫూర్తిదాయకమైనవైతే.. మరి కొన్ని ఫన్నీగా ఉంటాయి. తాజాగా ఆయన ‘‘కెలాగ్స్‌ ఉప్మా’’ మీద పోస్టు చేసిన మీమ్‌ నెట్టింట నవ్వులు పూయిస్తోంది. విషయానికొస్తే.. సరిగ్గా పదేళ్ల క్రితం ‘‘కెలాగ్స్‌’’ అనే అమెరికా ఆహార ఉత్పత్తి సంస్థ భారత్‌లో అడుగుపెట్టింది. ప్రారంభంలోనే.. ఇంకేముంది ‘‘భారతీయుల బ్రేక్‌ఫాస్ట్‌ అలవాట్లు మార్చేస్తాం.. ఇడ్లీ, ఉప్మా దోశ బదులు కార్న్‌ఫ్లేక్స్‌, చాకో పాప్స్‌ తినేలా చేస్తాం’’ అంటూ సవాళ్లు విసిరింది. మరి మన భారతీయులు వారి ఆలోచనకు లొంగకపోవడం సరికదా! చివరకు ఆ కంపెనీ చేత ‘ఉప్మా’ ఉత్పత్తి చేయించేలా చేశారు. సరిగ్గా ఇదే విషయాన్ని మహీంద్రా ప్రస్తావిస్తూ ..‘‘ ఈ సంస్థ ప్రారంభమై పదేళ్లు గడుస్తోంది. ఇది పాత మీమ్ అయినప్పటికీ.. ప్రస్తుతం అందరినీ మాట్లాడుకునేలా చేస్తోంది. అందుకే మన లోకల్‌ ‘ఛాంపియన్స్‌’ గురించి తక్కువ అంచనా వేయొద్దు’ అంటూ సరదాగా ట్వీట్‌ చేశారు. దీనిపై నెటిజన్లు సైతం తమదైన శైలిలో స్పందించారు. ‘‘మేము కేవలం ఆహారాన్ని మాత్రమే తినము. సెంటిమెంట్లను కూడా తింటాం’’ అని ఒకరనగా..ఇక బ్రేక్‌ఫాస్ట్‌లో వీరి నుంచి దోశ, ఇడ్లీ కూడా మార్కెట్‌లోకి వస్తుందనుకుంటున్నా అంటూ మరొకరు ఫన్నీ కామెంట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు