Air india: విమానంలో చీమలెక్కాయి.. ప్రయాణం ఆగింది..

ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇతరత్రా అత్యవసర కారణాలు.. విమానాల రాకపోకలపై ప్రభావితం చూపుతాయన్న విషయం తెలిసిందే. కానీ.. ఓ చీమల గుంపు కారణంగా విమానం టేకాఫ్‌ను నిలిపివేయడం చూశారా? అవును. సోమవారం...

Published : 06 Sep 2021 22:41 IST

దిల్లీ: ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇతరత్రా అత్యవసర కారణాలు.. విమానాల రాకపోకలపై ప్రభావితం చూపుతాయన్న విషయం తెలిసిందే. కానీ.. ఓ చీమల గుంపు కారణంగా విమానం టేకాఫ్‌ను నిలిపివేయడం చూశారా? అవును. సోమవారం దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు వెళ్లే ఎయిర్‌ ఇండియా విమానం(ఏఐ 111) టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది. ఇంతలో బిజినెస్‌ క్లాస్‌లో చీమల గుంపు కనిపించింది. దీంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే టేకాఫ్‌ను నిలిపివేశారు. మరో విషయం ఏంటంటే.. ఈ విమానంలోనే భూటాన్ యువరాజు జిగ్మే నాంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ కూడా ఉన్నారు. దీంతో ఎయిర్ ఇండియా.. వేరే విమానాన్ని ఏర్పాటు చేసింది. ఈ పరిణామాల కారణంగా మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లాల్సిన విమానం.. మూడు గంటలు ఆలస్యంగా, సాయంత్రం 5 దాటాక బయల్దేరింది. జులైలోనూ సౌదీ అరేబియా వెళ్తున్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సరకు రవాణా విమానం విండ్‌ షీల్డ్‌లో పగుళ్లు ఏర్పడటంతో.. కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. మే నెలలో దిల్లీ నుంచి అమెరికా వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో గబ్బిలం ఉన్నట్లు గుర్తించడంతో.. వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని