AP News: ఏపీలో ఆర్టీపీసీఆర్‌ ధరలు తగ్గించిన ప్రభుత్వం

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ టెస్టు కోసం వచ్చిన బాధితుల నుంచి కొన్ని ప్రైవేటు ల్యాబ్‌లు అధిక ధరలు వసూలు చేస్తున్నాయి.

Published : 19 Jan 2022 16:10 IST

అమరావతి: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ టెస్టు కోసం వచ్చిన బాధితుల నుంచి కొన్ని ప్రైవేటు ల్యాబ్‌లు అధిక ధరలు వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు ల్యాబ్‌ల దోపిడీపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల ధరలను పునఃసమీక్షిస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఐసీఎంఆర్‌ అనుమతి పొందిన ప్రైవేటు ల్యాబ్స్‌లలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షకు రూ.350గా నిర్ధారిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తగ్గించిన ధరలను ఆయా ల్యాబ్‌లు తప్పక అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని